teluguleads.in
Newspaper Banner
Date : 31 March 2026, 5:05 pm Posted By : TELUGU LEADS

అంగన్వాడీ,సఖి కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అదేవిధంగా అంగన్వాడిలో చిన్నారులకు అందించే భోజనం మెనూ ప్రకారం ఇస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.తప్పని సరిగా మెనూ పాటించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించి కేసుల నమోదు,పరిష్కారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న కేసులు, సమస్యల పట్ల సఖి కేంద్రం పాత్ర కీలకమైనదని కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో చెప్పారు. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కూడా కల్పించాల్సి ఉంటుందని ఆయన వారికి సూచించారు.