teluguleads.in
Newspaper Banner
Date : 26 June 2026, 7:33 am Posted By : TELUGU LEADS

అందరినీ ఒకేలా చూడొద్దు

స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీసీ రోడ్ల ప్రారంభోత్సవం దృశ్యం

రఘునాథపల్లి లీడ్స్ న్యూస్: పనిచేసేవారిని పనిచేయని వారిని ఒకే రకంగా చూడొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం గబ్బెట గ్రామంలో రూ. 15 లక్షల సిసి రోడ్డును,ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఏం చేశాడో? ఒకసారి ఆలోచించాలని, బిఆర్ఎస్ నాయకుల పవి దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం అస్సలు లేదని విమర్శించారు. గబ్బెట గ్రామానికి రానున్న రోజుల్లో రూ.కోటి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం, ఎన్నో ఏళ్లుగా లేని రేషన్ కార్డులను అందించడం జరుగుతుందన్నారు. సిఎం .రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం రఘునాథపల్లి రైతు వేదికలో 48 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి,తహసిల్దార్ రాజేష్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్,గబ్బెట గ్రామ సర్పంచ్ కూటికంటి ఉపేంద్ర అనిల్ గౌడ్, రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ బొల్లం ఉమారాణి,కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గొరిగె రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల శివ కుమార్ నామాల బుచ్చయ్య,కోళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.