teluguleads.in
Newspaper Banner
Date : 25 March 2026, 9:54 pm Posted By : TELUGU LEADS

అప్సా సేవలు అభినందనీయం

మందులు పంపిణీ చేస్తున్న డాక్టర్ భవాని

బేగంపేట్, మార్చి 25, (లీడ్స్ న్యూస్):
హైదరాబాద్ మహానగరంలో బుధవారం  కవాడిగూడ,డివిజన్ పరిధిలో దోమలగూడ బండా నగర్ లో అప్స స్వచ్ఛంద సంస్థ, ఆద్య హాస్పిటల్, రాహుల్ ఐ ఫౌండేషన్ సమన్వయ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆధ్యా హాస్పిటల్ మహిళా వైద్య నిపుణులు శ్రీమతి డాక్టర్ భవాని మాట్లాడుతూ ఆకుకూరలు గుడ్లు పండ్లు హైజినిక్స్ పప్పు దినుసులు తీసుకోవాలని మహిళలకు ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు వైద్యుల సమక్షంలో పరీక్ష చేసుకొని సలహాలు పాటిస్తూ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యయ హాస్పిటల్ ప్రతినిధులు శ్రావణి, రజిత, చెన్నయ్య, అప్స కోఆర్డినేటర్,రాజేశ్వరి,శోభ, ప్రతినిధులు,శ్రావణి, లావణ్య,మల్లిక,ఇందిర, సీనియర్ బిజెపి కార్యకర్త,కుమార్ గౌడ్,బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్ శేఖర్,బస్తి ప్రజలు పాల్గొనడం జరిగింది.