అమరుల స్ఫూర్తిగా పనిచేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్:శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత అయన పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలంచి నివాళులర్పించారు. విధుల్లో అమరులైన పోలీసులను స్మరించుకోవడం,వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత...