ఆకస్మికంగా హెల్త్ డైరెక్టర్ తనిఖీ

లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు,ప్రజలకు అందుతున్న వైద్య సేవలు,మాతా శిశు సంరక్షణ సేవలపై అయన వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధిగా సమయపాలన పాటించాలని,పేద ప్రజలకు నాణ్యమైన,వేగవంతమైన ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి,ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కమల్ హాసన్, సిహెచ్ఓ.రామ్ కిషన్,ఇతర సిబ్బంది ఉన్నారు.