teluguleads.in
Newspaper Banner
Date : 21 July 2026, 7:48 pm Posted By : TELUGU LEADS

ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికలు

-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,లీడ్స్ న్యూస్: ఎల్ నీనో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఆరుతడి పంటలకు ప్రాథమిక ఇచ్చేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల రివ్యూ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఆరు తడి పంటల వారీగా టార్గెట్ ఇచ్చామని తెలిపారు. మరియు రైతులకు ఎల్ నీనో ప్రభావం వల్ల ఆరుతడి పంటలైన కంది పెసర మరియు మినుము పంటలను సాగు చేయడానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు గ్రామ స్థాయిలో వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఉద్యాన మరియు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారన్నారు. వీబీ జీ రామ్ జీ పథకాన్ని సమన్వయము చేస్తూ 2,400 ఎకరాల్లో ఉద్యనవన పంటలు వేసేందుకు జిల్లా లో టార్గెట్ ఇచ్చామని,మూడు నెలల్లో అధికారులు లక్ష్యాలను సాధించేలా క్షేత్ర స్థాయి లో తగు చర్యలు తీసుకున్నరన్నారు
జిల్లా లో 62 మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పార దర్శకంగా ఎరువులను అందిస్తున్నరన్నారు.
ఏఈవో క్లస్టర్ స్థాయిలో యూరియా,డిఏపి ఎరువులను రైతులకు అందిస్తున్నామని చెప్పారు.