డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్,లీడ్స్ న్యూస్ : ఇకపై ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు స్వస్తి పలుకుతున్నట్లు రాష్ట్ర డిజిపి సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అయితే ప్రజలను గౌరవిస్తాము కానీ,రౌడీలు, గుండాలను మాత్రం సహించబోమని డీజీపీ తెలిపారు. తెలంగాణలో మావోయిజం అంతమైందని, ఇందుకోసం పనిచేసిన గ్రేహౌండ్స్ విభాగాన్ని తీసివేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం పనిచేసిన 1700 మంది గ్రేహౌండ్స్ సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గంజాయి,డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ క్రైమ్ తమకు పెద్ద సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.