ఇదీ రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్,లీడ్స్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్ళు. సరిగ్గా ఇదే రోజున అంటే జూలై 4న 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి అంచలంచలుగా వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధిగా ఎన్నికవుతూ 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. జడ్పిటిసిగా గెలుపొందిన అయన ఏడాది తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ...