ఈ నెల 6న కేసీర్ సమావేశం

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: సెప్టెంబర్ 7వ తేదీ నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్వహించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లిలోని కేసీర్ నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని కెసిఆర్ ఆదేశించారు.