ఉపాధ్యాయులకు ముందస్తు పాఠ్య ప్రణాళిక అవసరం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లీడ్స్ న్యూస్,జనగామ:విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ముందస్తుగా సన్నద్ధమై ఓ ప్రణాళికతో  తరగతి గదిలోకి వెళ్ళాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం జిల్లాలోని దేవరుప్పుల మండల పరిధిలో గల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా 8వ,10వ తరగతి గదులను సందర్శించి,ఉపాధ్యాయుల బోధన విధానాన్ని,విద్యార్థుల అభ్యాసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులను పలు...