ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్
హైదరాబాద్ (లీడ్స్ న్యూస్): ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి తగిన సమాచారంతో రావాలని,ఏదయినా మాట్లాడే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన సీఎల్పీ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ సెషన్ కు హాజరయ్యే ముందు తగిన సమాచారంతో రావాలని, ఏది పడితే అది మాట్లాడకూడదని, ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు. ప్రతిపక్షాలను తిప్పుకొట్టే విధంగా ప్రతి ఒక్కరు తగిన సమాచారంతో సిద్ధంగా...