teluguleads.in
Newspaper Banner
Date : 16 October 2026, 2:58 pm Posted By : TELUGU LEADS

ఎమ్మెల్సీ ఓటర్ నమోదును వంద శాతం చేపట్టాలి

డిసిసి ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి

లీడ్స్ న్యూస్,జనగామ: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదును నూరు శాతం పూర్తి చేయాలని  కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి కోరారు. శుక్రవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కార్యలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్‌ రవళి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబులతో అయన కలిసి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.డిగ్రీ పూర్తి చేసి అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను యువజన,సోషల్‌ మీడియా విభాగాలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. అర్హులైన వారిని గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు మండలాల వారీగా కోఆర్డినేటర్లు,అసిస్టెంట్‌ కోఆర్డినేటర్ల నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మండల,పట్టణ స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ కోఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ ఓట్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి అందించాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనసి క్రాంతి కుమార్, పార్టీ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.