ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’
హైదరాబాద్, (లీడ్స్ న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న తొలిసారిగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ గీతం 'జనగణమన'గేయానికి ముందు 'వందేమాతరం' గేయాన్ని ఆలపించనున్నారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పంద్రాగస్ట్ రోజున ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించేందుకు ఎర్రకోట వద్దకు చేరుకున్నాక తొలుత వందేమాతరం ఆలపిస్తారని, అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి 'జనగణమన'గీతాన్ని ఆలపిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.