teluguleads.in
Newspaper Banner
Date : 29 July 2026, 9:31 am Posted By : TELUGU LEADS

ఎల్ నీనో వల్ల పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద అవసరం

జనగామ, లీడ్స్ న్యూస్ : పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం,పచ్చిమేత కొరత వంటి పరిస్థితులు ఏర్పడి పశుసంపదపై, ముఖ్యంగా పాల పశువులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తగిన జాగ్రత్త లు తీసుకోవలని సూచనలు చేశారు. పశు వైద్యులు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, పశుసంపదపై ఎల్ నినో ప్రభావ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో డివిహెచ్ఓ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.