teluguleads.in
Newspaper Banner
Date : 06 March 2026, 7:48 am Posted By : TELUGU LEADS

కడియం విచారణ పూర్తి

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. అయితే తుది తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉండగా దానం నాగేందర్ విచారణ అనంతరం స్పీకర్ తీర్పును వెల్లడించనున్నారు. ఈ విషయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు వీరిద్దరిపై పిటిషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ట్రిబ్యునల్ తుది వాదనలు వినిపించేందుకు గురువారం చివరి సారిగా అవకాశం కల్పించింది. కడియం పక్షాన ఆయన లాయర్ తుది వాదనలు వినిపించారు. దానం నాగేందర్ విచారణ ఈనెల 7న మధ్యాహ్నం 2.30 గంటలకు  ఖరారు చేయడంతో ఆ విచారణ పూర్తయ్యాక స్పీకర్ ఈ ఇద్దరిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పిరయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసింది. శనివారం సాయంత్రానికి దానం నాగేందర్ విచారణ కూడా కొలిక్కి రానుంది. ఆ తర్వాత స్పీకర్ ఓ నిర్ణయం తీసుకొనున్నారు.