రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లక్ష్మీ తండాలో ఆదివారం నూతన సబ్స్టేషన్ ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. శిలాఫలకంపై స్థానిక సర్పంచ్ పయ్యావుల రవి పేరు లేకపోవడంపై బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
సర్పంచ్ సమాచారం మేరకు మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్,మండల కోఆర్డినేటర్ కొర్ర రాజేందర్ నాయక్,ఆరూరి మల్లేష్తో పాటు కార్యకర్తలు,గ్రామస్థులు సమావేశమై ప్రారంభత్సవానికి రానున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానిక ఎస్సై నరేష్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సర్దిచెప్పి అక్కడనుండి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామ సర్పంచ్ పయ్యావుల రవికి నేరుగా ఫోన్ చేసి అధికారుల తప్పిదాన్ని తాను కూడా సహించడం లేదని, తప్పకుండా శిలాపాలకుపై పేరు పెట్టించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో బిఆర్ఎస్ నాయకులు శాంతించారు. దీంతో వివాదం సదుమనిగింది.