teluguleads.in
Newspaper Banner
Date : 03 March 2026, 9:25 pm Posted By : TELUGU LEADS

కలెక్టర్ల తీరుపై సీఎం ఫైర్

లీడ్స్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశం ఈ సాయంత్రం ముగిసింది. ప్రధానంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. కొందరు కలెక్టర్లు స్థానికంగా ఉండడం లేదని, సీఎస్ కు తెలియకుండా హైదరాబాద్ వస్తున్నారని, తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి,దుదిల్ల శ్రీధర్ బాబు,సీతక్క కొండ సురేఖ,సిఎస్ రామకృష్ణారావు,ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.