కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, లీడ్స్ న్యూస్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ ధర్మాసనం విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా ఈరోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సింగిల్ బెంచ్ స్టే విధించడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు...