కార్యదర్శిగా నామాల బుచ్చయ్య


జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లింగాల జగదీష్ చందర్ రెడ్డికి మరో మారు అవకాశం దక్కింది. 20 ఏళ్లుగా బ్లాక్ కాంగ్రెస్ నాయకుడిగా, మాజీ జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించింది. అదేవిధంగా మాజీ సర్పంచ్,టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, నామాల బుచ్చయ్య ఇదే మండలం అశ్వరావు పల్లి గ్రామానికి చెందినవాడు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్న క్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో పార్టీ అతని సేవలను గుర్తించి జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా సోమవారం వారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని తన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, పార్టీ నేతలు పలువురు ఉన్నారు.
