బిజెపి పాలనలో పేద మధ్యతరగతి, రైతులు,కార్మికులు పరిస్థితి దారుణం
12 ఏళ్ల బిజెపి పాలనలో విసిగిపోయిన యువత
కాక్రోచ్ జనత పార్టీ పేరుతో యువత కొత్త పార్టీ
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు.

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీతో దేశంలోని యువత జీవితాలతో చెలగాటమా డుతుందని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఏ. ఎస్.ఆర్ గార్డెన్ లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కావటి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఐ జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న సంపదను అంబానీ ఆదానిలకు దోచి పెడుతూ దేశాన్ని కార్పోరేట్ కబంధహస్తాల్లో నలిపివేస్తూ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని అయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ తో కోట్లలో ప్రజల సొమ్మును కోళ్లగొడుతూ యువత రోడ్డున పడేస్తున్నా రని అయన ఆవేదన వ్యక్తం చేసారు. నీట్ పేపర్ లీకేజీ పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతూ విచక్షణ రహితంగా అమ్మాయిలని చూడకుండా లాఠీచార్జి చేయడం పట్ల అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 12 ఏళ్ల బిజెపి ప్రభుత్వ పాలనలో విసిగిపయిన యువత ఉద్యోగాలు రాక అసహనంలో నుంచి పుట్టుకొ చ్చిందే జనతా కాక్రోచ్ పార్టీ అని అన్నారు. గత కొద్దీ రోజులుగా సోనామ్ చుంగ్ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అయన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి అతన్ని పోలీసుల చేత ఎత్తుకెళ్లి ఆసుపత్రిలో వేయడం వెనక ప్రధాని మోడీ ఆంతర్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి పాలనలో రైతులు,కార్మికులు, కర్షకులు, పేద,మధ్య తరగతి, నిరుద్యోగులు,మహిళలు ఎవరు కూడా సంతృప్తిగా లేరని అయన తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ మోడీ ప్రజా వ్యతిరేక విధానా లకు పాల్పడుతూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ,అమిత్ షాలు కలిసి జై శ్రీరాం అంటూ మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతూ ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని మోసం చేస్తున్నారని అయన ఆరోపించారు. అయోధ్య రామాలయంకు సంబదించిన రూ.200 కోట్ల నిధులు మాయం వెనక అసలు దోషులెవరో ప్రజల ముందు ఉంచి ప్రధాని మోడీ తన నిజాయితీని నిరూపించు కోవాలని అయన డిమాండ్ చేసారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు మరిచి అటు ప్రజలను,ఇటు యువతను మోసం చేసిందని అయన అన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర అసంతృప్తికి గురవుతున్న ప్రజల వ్యతిరేకతకు ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరిం చారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అధికారం కొరకు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ మాట్లాడటం పట్ల అయన అసహనం వ్యక్తం చేశారు.వీళ్ళ ప్రజల్ని ఉద్ధరించేది అంటూ ఆయన కాంగ్రెస్,బిఆర్ఎస్ ల తీరుపై ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలనీ అయన కోరారు. ఏల్ నినో ప్రభావంతో రాష్టంలో సరియైన సమ యంలో వర్షాలు కురవక భూములు బిడు వారి రైతులు సాగు నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారని అయన తెలిపారు.రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేవదుల రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని అందించాలని అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చసారు. వందేళ్లకు పైన చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ సిద్ధాంత లకు ఎంతోమంది మహా మహా నాయకులు పదవులకు ఆశించకుండా దేశంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగిన ముందుండి పోరాడేది కమ్యూనిస్టులే అయన గుర్తు చేసారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అసమాన తలను రూపుమాపడమే సిపిఐ పార్టీ ప్రధాన లక్ష్యం అని అయన అన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక,రాజకీయ అసమానతల పట్ల యువత రాష్ట్రంలో ఉన్న యువత మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనంతరం కుర్చపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సిపిఐ పార్టీ జెండా కప్పుకొని పార్టీలో చేరారు. అంతకు ముందు కోడూరు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు గొరిగే సోమయ్య చేత ఎమ్మెల్యే కూనంనేని సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరింప జేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి,సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇట్టబోయిన ఉమా మహేష్, సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి అది సాయన్న,సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పాతూరి సుగుణమ్మ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్,పుప్పాల ఐలయ్య, వివిధ మండలాల కార్యదర్శులు రావుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.