కార్యదర్శిపై చర్యలు తీసుకోండి

నర్మెట గ్రామ కార్యదర్శి కందగట్ల శ్రీధర్ జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లుగా ఒకే గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నర్మెట గ్రామ పంచాయతీ కార్యదర్శి కందగట్ల శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదే గ్రామానికి చెందిన పులి రేణుక కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే…పనుల కోసం పంచాయతీ కార్యాలయానికి వెళితే కార్యదర్శి సకాలంలో పనులు చేయకపోగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో వాపోయింది. స్థానికుడు అయి...