teluguleads.in
Newspaper Banner
Date : 19 March 2026, 8:56 pm Posted By : TELUGU LEADS

కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో గురువారం సాయంత్రం పోలీసులు కిరాణా షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎర్రం హరిప్రసాద్ కు సంబంధించిన ఇంట్లో స్వల్పంగా నిషేధిత పొగాకు,అంబర్ ప్యాకెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా గుట్కాలు,పొగాకు పదార్థాలను విక్రయించినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు అమ్మినట్లు సమాచారం ఉంటే పోలీసుల ద్రుష్టికి తీసుకురావాలని ఎస్ఐ సూచించారు.