కెనాల్లో దూకి బాలుడు దుర్మరణం
లీడ్స్ న్యూస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలో స్విమ్మింగ్ పూల్ అనుకొని ఎండి. తాహిర్ (07) కెనాల్లో దూకి దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. జనగామకు చెందిన తాహిర్ పాఠశాలకు దసరా సెలవులు రావడంతో బాంజిపేట గ్రామమైన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తన తాత గఫూర్ తో కెనాల్ చూపించాలని కోరగా ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కెనాల్ వద్దకు వెళ్లారు. గఫూర్ వాహనాన్ని ఆపి పార్కింగ్ చేస్తుండగా వెంటనే తాహిర్ పరిగెత్తుకుంటూ వెళ్లి కెనాల్...