teluguleads.in
Newspaper Banner
Date : 16 April 2026, 7:59 pm Posted By : TELUGU LEADS

కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అలాగే స్టేషన్లో నమోదైన కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్ వేస్తున్నారా? లేదా? ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే రిజిస్టర్ చేస్తున్నారా? లేదా? తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీస్ వ్యవస్థ పై నమ్మకం కలిగే విధంగా, సత్వర న్యాయం జరిగేలా హౌస్ ఆఫీసర్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. తనిఖీ సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలతో ఆయన కాసేపు మాట్లాడి స్థానిక అధికారుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎస్సై దూదిమెట్ల నరేష్, స్టేషన్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.