teluguleads.in
Newspaper Banner
Date : 18 May 2026, 9:23 am Posted By : TELUGU LEADS

కోమల్ల వద్ద రెండు రోడ్డు ప్రమాదాలు

ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం

మరొక ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల వద్ద కొద్దిసేపటికి క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కోమల్ల కు చెందిన హలవత్ బాలాజీ (48) మృతిచెందగా అయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని వరంగల్ కు తరలిస్తుండగా బాలాజీ మృతిచెందాడు. అతని కొడుకు పరిస్థితి కూడా విషమంగా అదేవిధంగా కోమల్ల యుటర్న్ వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ముగ్గురిదీ కోమల గ్రామం.