
రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లుగీత కార్మికుడు తాళ్లపల్లి రవి (55) మంగళవారం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం సాయంత్రం కల్లు గీసేందుకు వెళ్ళగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు. జనగామలో ప్రధమ చికిత్స అనంతరం హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందాడు. భార్య అంజలి,సోదరుడు ప్రభాకర్ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.