teluguleads.in
Newspaper Banner
Date : 04 March 2026, 5:03 pm Posted By : TELUGU LEADS

గ్యాస్ రీఫిల్లింగ్ పట్టివేత

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్)::అక్రమంగా గ్యాస్ సిలండర్ నిల్వచేసి రీఫిల్లింగ్ చేస్తున్నాడనే సమాచారం మేరకు జనగామ జిల్లా పాలకుర్తిలో ఉప్పల శ్రీనివాస్ పై కేసు బుధవారం నమోదయింది. జనగామ సివిల్ సప్లై డిటి లచ్చు నాయక్ నేతృత్వంలో అధికారులు మధ్యాహ్నం అకస్మాత్తుగా దాడిచేసి అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 15 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 6ఏ కేసు నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా సిలిండర్లను నిల్వ ఉంచడమే కాకుండా రీఫిలింగ్ చేయడం నేరమని లచ్చు నాయక్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఇ. శ్రీనివాస్,ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు.