జనగామలో విజిలెన్స్ తనిఖీలు

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం అక్ష్మిజకంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కార్యాలయంలో అనేక తప్పుడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఈ దాడులకు పూనుకున్నట్లు తెలుస్తుంది. డాక్యుమెంట్ రైటర్లు,కార్యాలయ సిబ్బంది,రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా బదిలీ అయిన సబ్ రిజిస్టర్ కరుణ సహా ఓ రాజకీయ నాయకుడు కలిసి ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి పేరుతో తప్పుడు ఆధార్...