జనగామ జిల్లాలో భారీ బదిలీలు
జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జిల్లాలో భారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 160 మంది కార్యదర్శులు ఈ బదిలీల్లో స్థానచలనం పొందారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 221 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో 160 మంది కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ఒకే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శులందరిని బదిలీ చేశారు. అయితే, ఇంతకుముందున్న...