teluguleads.in
Newspaper Banner
Date : 13 March 2026, 8:11 pm Posted By : TELUGU LEADS

జనగామ జిల్లాలో విజిలెన్స్ దాడులు                           

భారీగా సిలిండర్లు పట్టివేత

పట్టుబడిన సిలిండర్లతో అధికారులు

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లు,టిఫిన్ సెంటర్లపై సంయుక్తంగా  దాడులు చేసి ఒకేరోజు 42 సిలిండర్లను పట్టుకున్నారు. పాలకుర్తి నుండి జనగామ క్రాస్ రోడ్ వరకు పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఓఎస్డి ప్రభాకర్, లక్ష్మారెడ్డి, జనగామ సివిల్ సప్లై డీటీలు లచ్చు నాయక్ ఇ. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. పట్టుబడిన సిలిండర్లను జనగామలోని వీరభద్ర గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. ఇల్లీగల్ గా సిలిండర్లు అక్రమంగా వాడుతున్న వారిపై పెరా కేసు నమోదు చేసి నివేదికను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అందజేసినట్లు అధికారులు ‘లీడ్స్ న్యూస్’ ప్రతినిధితో చెప్పారు. ఇల్లీగల్ గా ఎవరు డొమెస్టిక్ సిలిండర్లను వాడకూడదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.