
జనగామ, లీడ్స్ :తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా రఘునాథపల్లి మండలం ఖిలాషాపుర్ గ్రామానికి చెందిన కట్ల సదానందం ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న ఆయన ఎన్నికను అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సదానందం ముదిరాజ్ సంఘంలో కీలకం గా పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా సదానందం తన ఎన్నికకు సహకరించిన వారికి పేరుపేరన కృతజ్ఞతలు తెలిపారు.పలువురు బీసి సంఘం నాయకులు మంగళంపల్లి రాజు తదితరులు నూతన అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించారు.