teluguleads.in
Newspaper Banner
Date : 10 March 2026, 1:23 pm Posted By : TELUGU LEADS

డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఈ ప్రాంతాన్ని డ్రగ్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ఈ ప్రాంతానికి గంజాయి రవాణ అవుతుందని దాన్ని అడ్డుకట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒక అన్నేసి ఉంచాలన్నారు. ఈ ప్రమాదకర డ్రగ్స్ నివారణకు గ్రామాల్లో ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, కమిషనర్ రాధాకృష్ణ, ఎఫ్.ఆర్.ఓ చంద్రకాంత్ రెడ్డి,ఫైర్ ఆఫీసర్ దేవేందర్, సిడిపిఓ స్వరూప, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో విజయశ్రీ, ఎంఈఓ కొమురయ్య, డాక్టర్ అజయ్ కుమార్ వార్డ్ కౌన్సిలర్లు అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.