
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్ : శ్రీమన్నారాయణ పురం గ్రామంలో నిర్మించే శ్రీమన్నారాయణ దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కంచరకుంట్ల వంశీరెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వాహకులు రూ. రెండు లక్షల విలువైన చెక్కును దేవాలయ నిర్మాణానికి విరాళంగా రాంబాబు చేతిలో మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆయన అభినందించారు. గ్రామంలోని దేవాలయానికి కంచికచర్ల వంశీరెడ్డి ఫౌండేషన్ అందిస్తున్న సాయం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను కూడా తన వంతుగా సహకారం అందిస్తానని చెప్పారు. ఈ దేవాలయ పున:నిర్మాణానికి గ్రామస్తులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.