teluguleads.in
Newspaper Banner
Date : 05 May 2026, 8:28 am Posted By : TELUGU LEADS

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

నిందితులను చూపుతున్న ఏసిపి అంకిత్ కుమార్

వరంగల్ క్రైమ్,లీడ్స్ న్యూస్: నకిలీ దొంగ నోట్లను తయారు చేసి మోసం చేస్తున్న ఎనమిది మంది సభ్యుల దొంగల ముఠా ను వరంగల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ అంకిత్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లను ప్రింట్ తీసి మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, తక్కువ డబ్బులకు,1:3 నిష్పత్తిలో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి అడిగిన వారికి రూ.500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితలను ఇస్తూ మోసాగిస్తున్న మరో ఐదుగురు వ్యక్తులను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలీ నోట్లను,అసలు రూ.1,48,000 నగదు,28 లక్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్,13 సెల్‌ఫోన్లు,రెండు కార్లులను స్వాధీన పరుచుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1) శాగంటి కిరణ్, నివాసం,నర్సంపేట; 2) నీరటి శివ,నివాసం: నర్సంపేట,3) నీరటి రంజిత్, నివాసం, నర్సంపేట,4) గుడికందుల రవి, నివాసం, నర్సంపేట, 5) పోరిక రాజ్‌కుమార్ @ రాజు, నివాసం: ఘన్ పూర్ (ములుగు), 6) తనమాల రాజశేఖర్,నివాసం వేంసూరు, ఖమ్మం; 7) ముదురుకోల యాకంబరం,నివాసం, తాతానగర్,భువనగిరి,8) చేను సాయికిరణ్, నివాసం: కారకగూడెం (మండలం), కొత్తగూడెంకు చెందినవారిగా ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి మధుసూధన్‌,నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి,టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్పెక్టర్ బాబులాల్,నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎఎఓ సల్మాన్ పాషా, టాస్క్‌ఫోర్స్‌ నర్సంపేట సిబ్బందిని సిపి సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.