కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ధర్నా
జనగామ,లీడ్స్ న్యూస్:
ఆరుగాలం శ్రమించి పండించిన వరి, మొక్కజొన్న పంటల కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని, తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో రైతులు జనగామ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఒక దశలో కలెక్టరేట్ లోనికి రైతులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఎం నాయకులకు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కనుకారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి, సోమయ్య, సింగారపు రమేష్,సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులుబూడిద గోపి,జోగు ప్రకాష్, చుంచు విజేందర్,బోడ నరేందర్, పొత్కనూరి ఉపేందర్,మునిగల రమేష్,చిట్యాల సోమన్న,గంగాపురం మహేందర్,ఎండి అజారుద్దీన్, పలువురు తదితరులు పాల్గొన్నారు.
