ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాలు విఫలం
కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ధర్నా జనగామ,లీడ్స్ న్యూస్:ఆరుగాలం శ్రమించి పండించిన వరి, మొక్కజొన్న పంటల కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని, తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో రైతులు జనగామ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఒక దశలో కలెక్టరేట్ లోనికి రైతులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ...