teluguleads.in
Newspaper Banner
Date : 29 April 2026, 6:22 pm Posted By : TELUGU LEADS

నిత్యం అందుబాటులో ఉండండి

జిల్లా గ్రంథాల ఎస్ఎంఎస్ చైర్మన్ మారుజోడు రాంబాబు

రఘునాథపల్లి,(తెలుగు లీడ్స్): గ్రంథాలయంలో ఉద్యోగ,పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి అధిక సంఖ్యలో ప్రజలు గ్రంథాలయానికి వచ్చేలా చూడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. బుధవారం రఘునాథపల్లి శాఖ గ్రంధాలయాన్ని అయన సందర్శించారు. శాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా గ్రంథాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలగూర్చి ఆయన శాఖ అధికారులు ధనలక్ష్మి, లింగమూర్తిలకు సూచిస్తూ తప్పకుండా నిత్యం సమయపాలన పాటిస్తూ గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలని ఆయన వారిని ఆదేశించారు.