teluguleads.in
Newspaper Banner
Date : 14 March 2026, 8:34 am Posted By : TELUGU LEADS

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా  నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు నుంచి మొదలుకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 528,299 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి కొత్తగా పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ను హాల్ టికెట్లపై ముద్రించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలాస్ కోరారు. మరో వారం రోజుల్లో మూల్యాంకన ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

జనగామ…..

జనగామ జిల్లాలో మొత్తం 6,445 విద్యార్థులు ఈ పరీక్షలకు రాయనున్నారు. ఇందుకోసం మొత్తం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.