teluguleads.in
Newspaper Banner
Date : 06 April 2026, 7:32 pm Posted By : TELUGU LEADS

పకడ్బందీగా ఓపెన్ స్కూల్ పరీక్షలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,లీడ్స్ న్యూస్: ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే ఓపెన్ స్కూల్ పది,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 8,33 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,041 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారన్నారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.ఈ సమావేశంలో విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,ఆర్టీసీ డీఎం స్వాతి,ఏసీజీఈ రవి కుమార్, ఏపీఓ శ్రీధర్,విద్యుత్, పోస్టల్ శాఖ,వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.