సిద్దిపేట జిల్లా జడ్జి
జనగామ,లీడ్స్ న్యూస్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా జడ్జి సుదర్శన్ కోరారు. ఆయన శనివారం చేర్యాల కోర్టును సందర్శించిన సందర్భంగా జనగామ భార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రాజయ్య నేతృత్వంలో పలువురు న్యాయవాదులు సిద్దిపేట జడ్జిని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం న్యాయవాదులు మొక్కలు నాటాలని సూచించారు. ఆయనను కలిసిన వారిలో జనగామ జిల్లా న్యాయవాదులు పానుగంటి శ్రీనివాస్, శ్రీరాం శ్రీనివాస్, లక్ష్మణ స్వామి, గాజుల రవీందర్, ఆర్. ఉప్పలయ్య కొయ్యడ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
