పాఠాలు బోధించిన కలెక్టర్

విద్యార్థులు కష్టపడి చదవాలని సూచన జనగామ,లీడ్స్ న్యూస్:  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తరిగొప్పుల మండల కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్,గణితంపై గంటపాటు పాఠాలు బోధించారు. శనివారం ఆయన ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి పాఠాలు బోధించారు. గణితంలో మెలకువలు నేర్పారు, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేందుకు ఆయన పలు సూచనలు చేశారు. గణితంపై పట్టు సాధిస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకు మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆహార నాణ్యతలో...