teluguleads.in
Newspaper Banner
Date : 25 March 2026, 9:42 pm Posted By : TELUGU LEADS

పెట్రోల్,డీజిల్ ధరలు పెంచం

హైదరాబాద్, లీడ్స్ న్యూస్:

దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది లేదని కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని భరోసా ఇచ్చారు.