teluguleads.in
Newspaper Banner
Date : 18 July 2026, 6:59 pm Posted By : TELUGU LEADS

పోలీసుల చేయూత

ఆర్థిక సాయం అందిస్తున్న పోలీసు సిబ్బంది

రఘునాథపల్లి లీడ్స్ న్యూస్: హెడ్ కానిస్టేబుల్ సామల శ్రీనివాస్ కుటుంబానికి శనివారం రఘునాథపల్లి పోలీసులు రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీల్లో భాగంగా ఇటీవల నర్సంపేటకు వెళ్లి అక్కడే గుండెపోటుకు గురై అకాల మరణం చెందాడు. కాగా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు రఘునాథపల్లి ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ నేతృత్వంలో స్థానిక పోలీస్ సిబ్బంది కలిసి తమ వంతుగా సాయం అందించాలని భావించి ఈ ఆర్థిక సాయం చేసినట్లు వారు తెలిపారు.