ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రతీ వార్డ్ పరిశుభ్రంగా ఉండాలని, సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్ కి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందుతుందా?. సమయానికి డాక్టర్ లు అందుబాటులో ఉంటున్నారా?...