ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ,లీడ్స్ న్యూస్: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్‌షాలోంతో కలిసి ఆయన ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 326 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు మంజూరు చేయాలని దేవరప్పుల,చిలుపూర్ కుందారం గ్రామాలకు చెందిన మహిళలు విజ్ఞప్తి చేశారు. జనగామకు చెందిన సుకన్య తన 3 ఎకరాల 8 గుంటల భూమిని...