ఎస్ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్
అరైవ్…అలైవ్ పై అవగాహన

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని రఘునాథపల్లి ఎస్ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా అలైవ్..అరైవ్ కార్యక్రమం పై రఘునాథపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షతన సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ నియమాలను విధిగా ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 వరకు రోడ్డు ప్రమాదాల నివారణ, లైసెన్సుల జారీ, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించడం, రోడ్ సేఫ్టీ రూల్స్ పై, అదేవిధంగా అలైవ్ అరైవ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దావరి యాకయ్య, మాజీ సర్పంచ్ యాద రాములు,పంచాయతీ కార్యదర్శి బాలకిషన్,స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాస్,డ్వాక్రా సంఘాల మహిళలు,వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.