ప్రతీ పెట్రోల్ బంకులను తనిఖీ చేయండి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,తెటగు లీడ్స్: పెట్రోల్ డీజిల్ సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని జనగామ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కూమర్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, పోలీస్,లీగల్ మెట్రాలాజి అధికారులు నిరంతరం ప్రతీ బంకుని తనిఖీ చేసి ఇందన నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో  పెట్రోలు,డీజిల్ కృతిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలని,...