ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు
స్టేషన్ ఘన్పూర్ ఏసిపి భీమ్ శర్మ ప్రజలతో ప్రమాణం చేపిస్తున్న ఏసిపి, సీఐ రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని..ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని స్టేషన్గన్పూర్ ఏసిపి భీమ్ శర్మ, రఘునాథపల్లి రూరల్ సిఐ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డిలు సూచించారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి పాలన, అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుర్చపల్లి, కోమల్ల గ్రామాల్లో రఘునాథపల్లి ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు...