teluguleads.in
Newspaper Banner
Date : 12 May 2026, 9:10 pm Posted By : TELUGU LEADS

బండి భగీరథ్ కు నోటీసు లు

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: పొక్సో కేసులో బండి భగీరథ్ పై నమోదైన పలు సెక్షన్లను పోలీస్ లు సవరించి మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితురాలి స్టేట్మెంట్ ను మరోసారీ రికార్డ్ చేశారు. అనంతరం కఠినమైన బిఎన్ఎస్ సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లుగా సవరించి భగీరథ్ కు ఇంటికి వెళ్లి పోలీసుల నోటీసులు జారీచేశారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విహాయం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయా వర్గాల్లో పెను దుమరాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. మరి భగీరథ్ విచారంకు హాజరు అవుతాడా? లేదా అన్నది వేచి చూడాలి.