teluguleads.in
Newspaper Banner
Date : 25 September 2026, 11:02 am Posted By : TELUGU LEADS

బాలాపూర్ లడ్డూకి రూ. 39 లక్షలు

లీడ్స్ న్యూస్: బాలాపూర్ లడ్డూని
రూ.39 లక్షలకు అదే గ్రామానికి చెందిన
సామా ప్రణీత్ రెడ్డి వేలం పాటలో దక్కించుకున్నాడు. ఇదీ రికార్డ్ స్థాయి అని చెప్పొచ్చు. గతేడాది రూ.35 లక్షలకు పోగా ఈసారి మరో నాలుగు లక్షలు పెరిగింది. ఈ లడ్డు వేలంలో వచ్చిన నిధులతో గ్రామంలో స్కూళ్ళలో వసతుల కల్పన, సీసీ రోడ్లు, తాగునీటి ఏర్పాట్లు తదితర మౌలిక వసతుల కోసం వినియోగించనున్నట్లు బాలాపూర్ వినాయక ఉత్సవ కమిటీ తెలిపింది.